ETV Bharat / state

ఎస్పీకి ఫోన్ చేశాడు...సమస్యను పరిష్కరించుకున్నాడు.. - గుంటూరు జిల్లా ముఖ్యవార్తలు

గుంటూరు రూరల్​ జిల్లా ప్రజల కోసం బుధవారం నిర్వహించిన డయల్​ యువర్​ ఎస్పీ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఎస్పీ తన కార్యాలయం నుంచి ఫోన్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. 25 మంది ఫోన్‌ చేసి తమ సమస్యలను విన్నవించారు.

ఎస్పీకి ఫోన్ చేశాడు...సమస్యను పరిష్కరించుకున్నాడు.

author img

By

Published : Jul 29, 2021, 5:15 PM IST

గుంటూరు రూరల్​ జిల్లా ప్రజల కోసం బుధవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఎస్పీ తన కార్యాలయం నుంచి ఫోన్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని జానపాడుకు చెందిన దివ్యాంగుడు తోండేపు నాగేశ్వరరావు...30 సంవత్సరాల నుంచి తనకు, తన బంధువులకు ఇంటి స్థలం విషయంలో వివాదం కొనసాగుతోందని, బంధువుల తరపు నుంచి ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఫిర్యాదు చేశాడు. పోలీస్ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేయలేక డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం గురించి తెలుసుకోని ఎస్పీకి నేరుగా ఫోన్ చేసి తన సమస్యను తెలియజేశాడు. ఎస్పీ ఆదేశాలతో పిడుగురాళ్ల పోలీసులు..బాధితుడు, అతని బంధువులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

Tokyo Olympics: ప్రీక్వార్టర్స్​లో మేరీకోమ్ ఓటమి​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.