ETV Bharat / state

ఈ చిన్నారుల దయనీయ పరిస్థితి .. ఓ సారి చూడండి సారూ..!

author img

By

Published : Feb 18, 2023, 10:36 AM IST

Pathetic Condition of Diabetic Children: మధుమేహ బాధిత చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. నెలకు చికిత్సకు భారీగా ఖర్చుతో వారి ఆర్థిక పరిస్థితి మరింత దుర్భరంగా మారుతోంది. ప్రభుత్వాసుపత్రుల నుంచి ఇన్సులిన్‌ అందుతున్నా.. దీనికోసం దూరాభారం నుంచి రావడమే కష్టమవుతోంది. అనారోగ్యంతో బాధపడేవారికి ఇచ్చే విధంగానే మధుమేహ బాధిత చిన్నారులకు పింఛను ఇప్పించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Diabetic children
మధుమేహ బాధిత చిన్నారులు
మధుమేహ బాధిత చిన్నారుల దయనీయ పరిస్థితి

Pathetic Condition of Diabetic Children: జన్యుపరమైన సమస్యలు, ఇతరత్రా కారణాలలో చిన్న వయసులోనే మధుమేహం వస్తోంది. టైప్‌-1 మధుమేహం కారణంగా చాలా మంది చిన్నారులు రోజుకు నాలుగుసార్లు ఇన్సులిన్‌ తీసుకుంటున్నారు . వీరు ప్రభుత్వాసుపత్రుల నుంచి ఇన్సులిన్‌ తీసుకునేందుకు.. రవాణా ఖర్చులు, పరీక్షలకు నెలకు 4 నుంచి 5 వేల వరకు ఖర్చవుతోంది.

విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 150 మంది వరకు మధుమేహ బాధిత చిన్నారులు చికిత్స పొందుతున్నారు. విశాఖ కేజీఎచ్​లో చికిత్స పొందే మధుమేహుల్లో 20 ఏళ్ల లోపువారు 180 మంది వరకు ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి చిన్నారులు వేలల్లో ఉన్నారు.

మధుమేహ బాధితులు ఎక్కడికి వెళ్లినా ప్రాథమిక చికిత్స కిట్‌ తీసుకెళ్లాల్సిందే. ఆస్పత్రులకు దూరంగా ఉండేవారికి, రోజూ ఆస్పత్రికి వెళ్లలేని.. వారికి ఇళ్ల వద్దే ఇన్సులిన్‌ వేసుకునేలా శిక్షణ ఇచ్చారు. 15 రోజులకు సరిపడేలా ఒక వయల్‌ ఇస్తున్నారు. అది అయిపోగానే మళ్లీ ఆస్పత్రికి రావాలి.

గ్లూకోమీటర్‌తో రోజూ గ్లూకోజ్‌ స్థాయి తెలుసుకోవాలి. దాని ధర వెయ్యి రూపాయలు. గ్లూకోజ్‌ స్థాయి తెలుసుకోవాలంటే ఒక స్ట్రిప్‌ ఉండాలి. దీని ఖరీదు 15 నుంచి 20 రూపాయల మధ్య ఉంది. ఇవి కాకుండా సిరంజ్‌లు తదితరాలతో ఒక రోగికి నెలకు 2 వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇలాంటి పిల్లలకు పింఛను ఇవ్వాలని వారి తల్లిదండ్రులు రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతున్నారు.

టైప్‌-1 బాధిత పిల్లలు చిన్న వయసులో రోజుకు 40 నుంచి 50 యూనిట్ల మధ్య ఇన్సులిన్‌ తీసుకోవాలని.. యుక్త వయస్సు వచ్చే సరికి రోజుకు వంద యూనిట్ల ఇన్సులిన్‌ తీసుకోవాల్సి వస్తోందని మధుమేహ నిపుణులు చెబుతున్నారు. శరీరతత్వాన్ని అనుసరించి, తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే వీరి పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

18 ఏళ్లలోపు టైప్‌-1 వస్తే జీవితాంతం ఇన్సులిన్‌ వాడాల్సిందేనని.. దీనివల్ల ఆర్థికంగా చితికిపోతున్నామని బాధిత చిన్నారుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

"నాకు టైప్-1 డయాబెటిక్ ఉంది. నేను రోజూ నాలుగు సార్లు ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటాను. నాలుగు సార్లు పరీక్ష చేసుకుంటాను". - అక్షర, మధుమేహ బాధిత చిన్నారి

"నేను ఉదయం, సాయంత్రం ఇంజక్షన్​లు చేసుకుంటాను. కాలేజీకి వెళ్లినప్పుడు, తినకపోయినా కళ్లు తిరుగుతాయి. మా కుటుంబంలో ఆర్థిక సమస్యల వలన మెడిసిన్ సరిగ్గా కొనుక్కోలేక పోతున్నాము". - సౌభాగ్యం, మధుమేహ బాధిత చిన్నారి

"నెలకు 8 వేల రూపాయల వరకూ అవుతున్నాయి. ఇవి కేవలం మెడిసిన్స్​కే అవుతున్నాయి. టెస్ట్​లు ఏమైనా చేయించుకోవాలంటే ఎక్కువ అవుతున్నాయి. నేను వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాను. వచ్చిన డబ్బులు ఇంటి అవసరాలకే సరిపోతున్నాయి. ప్రభుత్వం , స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని కోరుతున్నాము". - ఢిల్లీబాబు, మధుమేహ బాధిత చిన్నారి తండ్రి

"ఇన్సులిన్ శరీరంలో ఉన్న అన్ని అవయవాలను ఉత్తేజం చేస్తుంది. కాబట్టి శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి ఇన్సులిన్ అవసరం. ఇన్సులిన్ తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాల సమస్య వచ్చే అవకాశం ఉంది". - పీవీ రావు, ఎండోక్రెనాలజిస్ట్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.