ETV Bharat / state

DHULIPALLA: సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దన్న హైకోర్టు - గుంటూరు జిల్లా వార్తలు

సంగం డెయిరీని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోరాదని.. హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. డెయిరీ స్వాధీనానికి ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు నిలిపివేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌ను ధర్మాసనం తిరస్కరించింది. కోర్టు ఆదేశాలను సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ స్వాగతించారు. దీనిని రైతుల విజయంగా పేర్కొన్నారు.

సంగం డెయిరీ
సంగం డెయిరీ
author img

By

Published : Sep 1, 2021, 4:49 PM IST

Updated : Sep 1, 2021, 10:45 PM IST

సంగం డెయిరీపై కుట్రలను తిప్పికొడతామంటున్న ధూళిపాళ్ల

ఈ ఏడాది ఏప్రిల్‌ 27న సంగం డెయిరీ స్వాధీనానికి ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలును నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ జీవో విషయంలో హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ సోమయాజులు ఇచ్చిన తీర్పును డివిజనల్‌ బెంచ్‌ సమర్దించింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌చేస్తూ ధర్మాసం ముందు ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ అపీల్‌ను తిరస్కరించింది. సంగం డెయిరీ విషయంలో దాఖలైన ఇతర ఇంప్లీడ్‌ పిటిషన్లనూ తోసిపుచ్చింది.

కంపెనీ హోదా వచ్చాక జోక్యం తగదు..

సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ధర్మారావు.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరపున సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. డెయిరీ నిర్వహణ బాధ్యతను పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి అప్పగిస్తూ 1978 ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తుతం ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం 2021లో జీవో ఇచ్చిందని తెలిపారు. ఇన్నేళ్ల తర్వాత ఉపసంహరించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కంపెనీ హోదా పొందాక రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదని అన్నారు. రాజకీయ కారణాలతో సంగం డెయిరీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారని వాదించారు.

ప్రభుత్వ రిట్ పిటిషన్ల కొట్టివేత..

ప్రజాప్రయోజనాల దృష్ట్యానే జీవో జారీ చేశామని ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదించారు. ఆ జీవోతో డెయిరీ కార్యకలాపాలకు ఎలాంటి అవరోధం లేదన్నారు. జీవోను నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సమర్థనీయంగా లేవన్నారు. ఆ ఉత్తర్వులను రద్దు చేసి జీవో అమల్లోకి వచ్చేలా చూడాలన్నారు. ప్రభుత్వ జీవోను సమర్థిస్తూ గుంటూరు జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ సంఘం కూడా అప్పీలు చేయగా.. జీడీఎంపీఎస్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. తమ వాదనలు వినకుండానే.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ప్రభుత్వ జీవోను సవాలు చేసే అర్హత ఎస్ఎంపీసీఎల్ డైరెక్టర్‌కు లేదన్నారు. తమ ఫిర్యాదు ఆధారంగా సంగం డెయిరీలో అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేపట్టిందన్నారు. ప్రజా ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఏపీ పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ కూడా హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. అందరి వాదనలు విన్న అనంతరం.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ ప్రభుత్వ రిట్ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది.

''సంగం డెయిరీని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం పన్నిన కుట్రను హైకోర్టు భగ్నం చేసింది. డెయిరీ స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్-19 చెల్లదని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. కోర్టు తీర్పు గుంటూరు జిల్లా పాడి రైతుల విజయం. సంగం డెయిరీనీ దెబ్బతీసి అమూల్​కు లబ్ది చేకూర్చేందుకే ప్రభుత్వం కుట్రలు. అందులో భాగంగానే జీవో-19 విడుదల. ఎట్టి పరిస్థితుల్లోనూ తుది విజయం మాదే.'' - ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఛైర్మన్

ఇదీ చదవండి:

Macharla Murder case: హత్య కేసులో విశ్రాంత ఆర్మీ జవాను అరెస్ట్

Last Updated : Sep 1, 2021, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.