ETV Bharat / state

వైఎస్సార్సీపీని సాగనంపితేనే రాష్ట్రంలో సహజవనరుల దోపిడీ ఆగుతుంది: టీడీపీ

Dhulipalla Narendra Padayatra on Gravel Mining: గుంటూరు జిల్లాలో మట్టి, గ్రావెల్ దోపిడీని నిరసిస్తూ ధూళిపాళ్ల నరేంద్ర పాదయాత్ర చేశారు. ఈ యాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపిన పలువురు నేతలు వైఎస్సార్సీపీ నాయకుల దోపిడీని ఎండగట్టారు.

Dhulipalla_Narendra_Padayatra_on_Gravel_Mining

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 8:45 AM IST

Updated : Dec 28, 2023, 12:15 PM IST

వైఎస్సార్సీపీని సాగనంపితేనే రాష్ట్రంలో సహజవనరుల దోపిడీ ఆగుతుంది: టీడీపీ

Dhulipalla Narendra Padayatra on Gravel Mining: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని సాగనంపితేనే రాష్ట్రంలో సహజవనరుల దోపిడీ ఆగుతుందని తెలుగుదేశం నేతలు అన్నారు. గుంటూరు జిల్లాలో మట్టి, గ్రావెల్ దోపిడీని నిరసిస్తూ ధూళిపాళ్ల నరేంద్ర తవ్వకాలు జరిపిన ప్రాంతాల్లో 2రోజుల పాటు పాదయాత్ర చేశారు. ఇందులో పాల్గొన్న ఆ పార్టీ ముఖ్యనేతలు అధికార పార్టీ నేతల దోపిడీని ఎండగట్టారు. 2వేల కోట్ల రూపాయల విలువైన మట్టిని కొల్లగొట్టారని ఇందులో సీఎం జగన్‌కు వాటా ఉందని విమర్శించారు.

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో సహజవనరుల దోపిడీని నిరసిస్తూ ప్రజాపోరుబాట పేరిట మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చేపట్టిన పాదయాత్ర పూర్తైంది. 2 రోజుల పాటు 24 కిలోమీటర్ల మేర జరిగిన పాదయాత్ర గ్రావెల్ క్వారీల గుండా సాగింది. చేబ్రోలు మండలంలో 7 గ్రామాల పరిధిలో మట్టిదోపిడీ జరిగిన ప్రాంతాలను నరేంద్ర స్థానికులతో కలిసి పరిశీలించారు.

వైఎస్సార్సీపీ గ్రావెల్ మాఫియాపై ధూళిపాళ్ల పాదయాత్ర - సంఘీభావం తెలిపిన నేతలు

అక్రమ తవ్వకాల వల్ల తలెత్తిన ఇబ్బందులను ధూళిపాళ్ల నరేంద్ర ముందు స్థానికులు ఏకరవు పెట్టారు. గ్రామాల్లో రోడ్లు పాడయ్యాయని క్వారీ గుంతల్లో పడి పిల్లలు చనిపోయారని వివరించారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో నీరు రాక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. గ్రామాల్లో పర్యావరణ విధ్యంసాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగిన నరేంద్ర బుధవారం శేకూరులో బహిరంగసభలో పాల్గొన్నారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలకు ఈ దోపిడీలో వాటా ఉందని ఆరోపించారు.

పాదయాత్ర ముగింపు సభలో టీడీపీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నేతలు 2వేల కోట్ల రూపాయలకు పైగా మట్టి, గ్రావెల్ దోపిడీ చేశారని నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే కిలారి రోశయ్య సహజ వనరులను కొల్లగొడుతున్నారని ఆక్షేపించారు. వారి అక్రమాలు బయటపెడుతున్నారన్న కక్షతోనే నరేంద్రపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు దోపిడీ దారులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

వైసీపీని ఇంటికి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి: ధూళిపాళ్ల

సహజ వనరుల దోపిడీని మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ నేత నరేంద్ర యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం ఇప్పటికే కోర్టులో ఉన్నందున అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

"వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని సాగనంపితేనే రాష్ట్రంలో సహజవనరుల దోపిడీ ఆగుతుంది. అధికార పార్టీ నేతలు 2వేల కోట్ల రూపాయలు విలువైన మట్టిని కొల్లగొట్టారు. ఇందులో సీఎం జగన్‌కు వాటా ఉంది. ఎమ్మెల్యే కిలారి రోశయ్య సహజ వనరులను కొల్లగొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఈ దోపిడీదారులకు తగిన బుద్ధి చెప్పాలి." - ధూళిపాళ్ల పాదయాత్రలో పాల్గొన్న నేతలు

Last Updated : Dec 28, 2023, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.