రాష్ట్రంలో రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో మరోసారి సమీక్ష చేసి తగు నిర్ణయాలు తీసుకుంటామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్నారు. రహదారి ప్రమాదాలతో రాష్ట్రంలో గడచిన 13 రోజుల్లో 3 వందల మంది.. ఏటా 8 వేల మంది ప్రాణాలు కోల్పోతుండటం బాధాకరమని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రహదారి నిర్మాణ లోపాలు, జంక్షన్ల వద్ద లైటింగ్ లేకపోవడం తదితర కారణాలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కర్నూలు జిల్లా వెల్దూర్తి వద్ద జరిగిన ప్రమాదంలోనూ రహదారి నిర్మాణ లోపాలు, అతివేగం కారణమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రాంతాల గుర్తింపు సహా నిర్మాణ లోపాల సవరణ కోసం రవాణా శాఖ అధ్యయనం చేస్తోందని.. వారి సమన్వయంతో నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు భద్రత, రహదారి నిబంధనలపై ప్రజలకు అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. విశాఖపట్నంలో జరిగిన కిడ్నీ రాకెట్, రేవ్ పార్టీల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. ఈ కేసుల్లో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామన్నారు. వైఎస్ వివేకా కేసు విచారణ జరుగుతోందన్న డీజీపీ.. ప్రస్తుతం ఆ కేసు పై ఏమీ చెప్పలేమన్నారు.
13 రోజుల్లో రోడ్లపై 300మంది మృతి : డీజీపీ - dead
గతంలో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి రోడ్డు ప్రమాదాలను అరికట్టగలిగాం. మూడు నెలల నుంచి వేరే పనులు ఉన్నందున రహదారి భద్రతపై దృష్టి సారించలేకపోయాం. ఇప్పటినుంచి వేగం పెంచుతాం... రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి అన్ని విధాలా కృషి చేస్తాం: డీజీపీ
రాష్ట్రంలో రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో మరోసారి సమీక్ష చేసి తగు నిర్ణయాలు తీసుకుంటామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్నారు. రహదారి ప్రమాదాలతో రాష్ట్రంలో గడచిన 13 రోజుల్లో 3 వందల మంది.. ఏటా 8 వేల మంది ప్రాణాలు కోల్పోతుండటం బాధాకరమని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రహదారి నిర్మాణ లోపాలు, జంక్షన్ల వద్ద లైటింగ్ లేకపోవడం తదితర కారణాలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కర్నూలు జిల్లా వెల్దూర్తి వద్ద జరిగిన ప్రమాదంలోనూ రహదారి నిర్మాణ లోపాలు, అతివేగం కారణమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రాంతాల గుర్తింపు సహా నిర్మాణ లోపాల సవరణ కోసం రవాణా శాఖ అధ్యయనం చేస్తోందని.. వారి సమన్వయంతో నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు భద్రత, రహదారి నిబంధనలపై ప్రజలకు అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. విశాఖపట్నంలో జరిగిన కిడ్నీ రాకెట్, రేవ్ పార్టీల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. ఈ కేసుల్లో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామన్నారు. వైఎస్ వివేకా కేసు విచారణ జరుగుతోందన్న డీజీపీ.. ప్రస్తుతం ఆ కేసు పై ఏమీ చెప్పలేమన్నారు.
Body:ap_rjy_31_14_annavaram_kalyanam_start_p_v_raju_av_c4_SD. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెను చేసే కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి అన్వేటి మండపంలో సీతారాముల చెంతనే ఆసీనులను చేసి పెళ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెను చేసే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేశారు. ముత్తైదువులు పసుపు దంచారు.
Conclusion: