ETV Bharat / state

దాతల సహకారంతో శ్మశాన వాటికల అభివృద్ధి.. - గుంటూరులో స్మశాన వాటికల అభివృద్ది

ప్రభుత్వ ఆసుపత్రి శవాగారంలో పేరుకుపోతున్న మృతదేహాలు... శ్మశాన వాటికలో కోవిడ్ మృతుల అంత్యక్రియలకు అడ్డంకులు... ఈ రెండు వార్తలు ఆ మహిళను కదిలించాయి. మరణించిన వారి చివరి మజిలీ గౌరవంగా ఉండాలే తప్ప... అందరూ ఉండి అనాథలా పోవటం ఏమిటనే మథనం మొదలైంది. ఆధునిక హంగులతో వేగంగా అంత్యక్రియలు నిర్వహించేలా శ్మశానవాటికల్ని సిద్ధం చేయటమే దీనికి మార్గమని భావించారు. దాతల సహకారంతో మూడుచోట్ల కాలుష్యం లేని శ్మశాన వాటికల్ని అభివృద్ధి చేశారు. మహిళలు శ్మశానం లోపలకు వెళ్లటం మంచిది కాదని భావించే సమాజంలో... ఓ మంచి పనికి అలాంటి అపనమ్మకాలు అడ్డురావని చాటారు.

వైద్యురాలు శ్రీ విద్య
వైద్యురాలు శ్రీ విద్య
author img

By

Published : Oct 26, 2020, 1:18 PM IST

దాతల సహకారంతో స్మశానవాటికల అభివృద్ధి చేసిన వైద్యురాలు
కరోనా మహమ్మారి తెచ్చిన భయం... మనుషుల మధ్య దూరాన్ని మరింతగా పెంచింది. కొవిడ్​తో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహం తాకేందుకు కాదు కదా.. కనీసం అంత్యక్రియలకు వెళ్లటానికి భయపడే పరిస్థితి. కుటుంబ సభ్యులు సైతం మృతదేహాలకు తీసుకెళ్లకుండా ఆసుపత్రుల్లోనే వదిలేసిన దుస్థితి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ మృతదేహాలు పేరుకుపోయాయి. బంధువులు తీసుకెళ్లకపోవటంతో గుంటూరు జీజీహెచ్ లో 50కి పైగా మృతదేహాలు అనాథ శవాల్లా పడి ఉన్నాయి. మరోవైపు శ్మశాన వాటికల వద్ద కూడా కొవిడ్ మృతదేహాల అంత్యక్రియల్ని స్థానికులు అడ్డుకుంటున్నారు.

స్పందించిన వైద్యురాలు శ్రీ విద్య..

ఈ విషయాలను మీడియాలో చూసిన శ్రీవిద్య అనే వైద్యురాలు తీవ్రంగా ఆవేదన చెందారు. సమస్య పరిష్కారానికి మనమేం చేయలేమా అని ఆలోచించింది. గ్యాస్ దహన వాటికల ద్వారా అంత్యక్రియలు త్వరగా పూర్తి చేయవచ్చు. ఒక్కో మృతదేహానికి వెయ్యి రూపాయల లోపే ఖర్చవుతుంది. పైగా ఎలాంటి కాలుష్యం వెదజల్లదు. శ్మశానం చుట్టుపక్కల వారు భయపడాల్సిన పనిలేదు. ఇలాంటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ గ్యాస్ ఆధారిత దహన వాటిక ఏర్పాటు చేయాలంటే 80లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అంత సొమ్ము తనవద్ద లేదు. జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ ని కలిసి తన ఆలోచనని వివరించింది. తమ వంతుగా మొదటగా 2 లక్షలు విరాళం అందించారు. తనకు తెలిసిన వారిని కలిసి విరాళాలు కోరింది. అందరి సహకారంతో.. గుంటూరులోని శ్మశాన వాటికలు ఆధునిక హంగులతో మృతదేహాల దహనానికి సిద్ధమయ్యాయి.

40 లక్షల మేర ఖర్చు...

కొత్తగా గ్యాస్ ఆధారిత దహన వాటిక ఏర్పాటుకు 80లక్షల నుంచి కోటి రూపాయలు అవసరం. ఖర్చు తగ్గించటంపై ఆలోచించారు. గుంటూరులోని స్థంబాల గరువు శ్మశాన వాటికలో గ్యాస్ విభాగం కూడా ఉంది. అక్కడి గ్యాస్ ప్లాంట్​ను ఉపయోగించుకుని... పక్కనే ఖాళీ స్థలంలో అదనపు విభాగం ఏర్పాటు చేశారు. అందుకు 40లక్షల రూపాయల మేర ఖర్చయింది. పనులు మొదలుపెట్టిన తర్వాత మరికొందరు దాతలు ముందుకు వచ్చారు. మొత్తం కోటి రూపాయలకు పైగా పోగయ్యాయి. శ్రీవిద్య ఆ మొత్తాన్ని అధికారులకు అందించింది.

కేవలం స్థంబాల గరువు శ్మశాన వాటికే కాదు.. నగరంలోని మరో రెండు శ్మశాన వాటికల అభివృద్ధికి వాటిని వెచ్చించారు. బొంగరాలబీడులోని శ్మశాన వాటికను సైతం కోటి రూపాయలతో ఇలాంటి దహన వాటికనే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అమ్మ ఆశ్రమంలో కూడా దహనవాటికను నిర్మించారు. అయితే అక్కడ కర్రలతో కాల్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. దానికి గ్యాస్ దహనవాటిక తరహాలో బ్లోయర్స్, చిమ్నీ ఏర్పాటు చేయటంతో 20 లక్షల ఖర్చులో పని పూర్తయింది. అక్కడ ఒకేసారి నాలుగు మృతదేహాలు దహనం చేసే వీలుంది. ఇలా హైబ్రిడ్ తరహా దహన వాటిక ఫలితాల్ని బట్టి మరికొన్నిచోట్ల వాటిని ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

కేరళ, హైదరాబాద్ నుంచి సామాగ్రి...

గ్యాస్ ఆధారిత దహనవాటిక సామాగ్రి మనవద్ద లభించదు. కేరళ నుంచి ముఖ్యమైన సామాగ్రిని తెప్పించారు. మరికొన్ని హైదరాబాద్ నుంచి సమీకరించారు. గ్యాస్ దహన వాటిక అమర్చేందుకు కేరళ నుంచే కూలీలను పిలిపించారు. గతంలో ఇక్కడ ఉన్న ప్లాంటు కంటే ఆధునిక హంగులతో సిద్ధం చేశారు. మనిషి జీవించినపుడు ఎంత సంతోషంగా ఉంటారో... మరణించిన తర్వాత వారి మృతదేహాలకు కూడా అంతే సజావుగా అంత్యక్రియలు జరగాలనే ఆలోచనే వీటికి బీజం వేసిందని శ్రీవిద్య చెబుతున్నారు. అధికారులతో పాటు శ్మశాన వాటిక నిర్వాహకుల సహకారం వల్లే ఈ పనులు పూర్తయ్యాయని తెలిపారు. జీవితంలో ఎవరైనా గుడికి, బడికి వెళ్లక పోవచ్చు. కానీ వారి చివరి మజిలీ మాత్రం శ్మశానమే. ప్రతిఒక్కరి చివరి మజిలీని సైతం ఆనందంగా చేసేందుకే ఇలాంటి కార్యక్రమానికి తోడ్పాటు అందించినట్లు శ్మశాన వాటిక నిర్వాహకులు చెబుతున్నారు.

రెండు నెలల్లోనే పూర్తి...
గ్యాస్ ఆధారిత విభాగం ఏర్పాటు చేయాలంటే 6 నెలల సమయం పడుతుంది. కానీ అందరి చొరవ, నిరంతర పర్యవేక్షణ వల్ల రెండు నెలల్లోనే దీన్ని సిద్ధం చేశారు. శ్రీ విద్య వృత్తిరీత్యా వైద్యురాలే అయినా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. కోవిడ్ సమయంలో మాస్కుల పంపిణి, వలస కూలీలకు ఆహారం పంపిణి ద్వారా సేవాగుణం చాటారు.

ఇదీచదవండి

నిరాధార ఆరోపణలతో జడ్జిలపై లేఖ రాశారు: అశ్వినీకుమార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.