భూ వివాదాలు అధిగమించి శాశ్వతంగా భూ హక్కు కల్పించడానికే 'భూ రీ-సర్వే' అని రెవెన్యూ శాఖ, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. దీని ద్వారా రైతులకు పటిష్టమైన సర్వే నంబర్లు ఏర్పడతాయన్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం డీపీ అగ్రహారంలో నిర్వహించిన 'భూ రీ-సర్వే' కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవెన్యూ మంత్రి, హోం మంత్రి సుచరిత హాజరయ్యారు. రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కరించే దిశగా రూ. వెయ్యి కోట్లతో మూడు విడతలుగా, మూడు పద్ధతుల్లో రీ సర్వే(land resurvey) చేస్తున్నట్లు ధర్మాన వివరించారు.
సర్వేకు సహకరించాలి: సుచరిత
రాష్ట్రంలో ఎక్కడా భూ సమస్యలు ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని.. భూ యజమానులు, రైతులు భూ సర్వేకు సహకరించాలని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత కోరారు. సర్వేలో ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ జరిగే విధంగా ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని... ఈ త్వరలోనే అమల్లోకి వస్తుందన్నారు.
ఇదెక్కడి దరిద్రం అండి అంటూ.. రైతు ఆవేదన
ఈ సందర్భంగా మంత్రులకు ఓ రైతు తమ ఆవేదన వెళ్లబుచ్చుకున్నాడు. పాసు పుస్తకంలో లోపాలు సరిచేయమని వీఆర్వోను సంప్రదిస్తే సర్వే రికార్డు పేరుతో తిప్పుతున్నారని ఆవేదన చెందారు. దీంతో హోంమంత్రి(home minster).. వెంటనే దుగ్గిరాల తహసీల్దార్ మల్లేశ్వరిని వివరణ అడిగారు. అందుకే ఈ సర్వే అని.. ఆ రైతు సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తహసీల్దార్ పేర్కొనడంతో ఆయన శాంతించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, పలువురు అధికారులు, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి..
CURFEW RELAX: '8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు..24 గంటలూ పీడియాట్రిక్ టెలీ సేవలు'