గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్టీసీ బస్ స్టేషన్ను గుంటూరు ఆర్టీసీ డిపో మేనేజర్ షర్మిల పరిశీలించారు. రాష్ట్ర, జాతీయ రహదారుల్లో ఎలక్ట్రికల్ బస్సులు నడపనున్న క్రమంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటుకు ఖాళీ స్థలాల నిమిత్తం రెవెన్యూ అధికారులతో మాట్లాడుతున్నామన్నారు. ఇప్పటి వరకు ప్రజా రవాణా సంస్థగా ఉన్న ఆర్టీసీలో ఇక నుంచి కార్గో సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. అందుకు బస్సులను ప్రత్యేకంగా తయారు చేస్తున్నట్లు తెలిపారు. 10 టన్నుల నుంచి 20 టన్నుల వరకు సరకులను తీసుకువెళ్లేలా బస్సులను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు కార్గో సేవలను అందిస్తామన్నారు. సరకులు రవాణా చేయాలనుకుంటే.. డిపో మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడవచ్చన్నారు. పెదనందిపాడు బస్ స్టేషన్ అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
ఇదీ చదవండి : విషాద చిత్రం.. అస్తమించిన 'ఉదయ కిరణం'