ETV Bharat / state

"ధరణికోట నుంచి ఎర్రకోట వరకు" నినాదంతో.. అమరావతి రైతుల దిల్లీ యాత్ర

Slogans from Dharanikota to Errakota: వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటన చేసి నేటికి సరిగ్గా మూడేళ్లు.. పూర్తయ్యింది. శాసనసభలో సీఎం జగన్‌ ప్రకటనతో.. రాజధాని గ్రామాల్లో "అమరావతి పరిరక్షణ ఉద్యమం" ఉవ్వెత్తున ఎగిసింది. ప్రభుత్వ అణచివేతలు, నిర్బంధాలన్నింటినీ అన్నదాతలు.. అధిగమించారు. భూములిచ్చి మమ్మల్ని ప్రభుత్వం నిలువునా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తూ నిర్విరామంగా ఉద్యమాన్నికొనసాగిస్తున్నారు. "ధరణికోట నుంచి ఎర్రకోట వరకు నినాదం"తో తాజాగా దిల్లీ యాత్ర చేపట్టారు. హస్తిన వేదికగా తమ గళాన్ని వినిపించడానికి అన్నదాతలు సిద్ధమయ్యారు. ఇవాళ జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేయనున్నారు.

DELHI TOUR
దిల్లీ యాత్ర
author img

By

Published : Dec 17, 2022, 9:42 AM IST

Updated : Dec 17, 2022, 11:45 AM IST

Slogans from Dharanikota to Errakota: గత ప్రభుత్వం అమరావతి రాజధానిగా ప్రకటించడంతో..ఆ ప్రాంత ప్రజలు, రైతులు ఎంతో సంబరపడిపోయారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేల ఎకరాలను రాజధాని రైతులు.. రాష్ట్ర భవిష్యత్‌ కోసం ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులు ఆగిపోయాయి. కొద్ది నెలల్లోనే సీఎం జగన్‌.. 3 రాజధానులు ప్రకటన చేయడంతో అమరావతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్నో కలలు గన్న రాజధాని రైతులు.. నిద్రలేని రాత్రులు గడుపుతూ నేటికీ ఉద్యమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.

మూడు రాజధానులు ప్రకటించి.. నేటికి మూడేళ్లు పూర్తవడంతో.. దిల్లీ గడ్డపై గట్టిగా చాటేందుకు సిద్ధమయ్యారు. పార్టీలు వేరు, అభిప్రాయాలు వేరు, సిద్ధాంతాలు వేరు.. అయినా అంతా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలనే ఏకాభిప్రాయం కోసం ఒక్కటయ్యారు. ప్రజల ఆకాంక్షే పార్టీల అజెండా అంటూ ఏకతాటిపైకి వచ్చారు. పాదయాత్రలు, నిరాహారదీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, అసెంబ్లీ ముట్టడి, మౌన ప్రదర్శనలు, ప్రార్థనలు, యాగాలు.. ఇలా ఎన్ని రకాల్లో నిరసన తెలపాలో అన్ని రకాల్లోనూ తమ గళాన్ని వినిపించారు. పోలీసు నిర్బంధాల్ని ఎదుర్కొన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. జైళ్లకు వెళ్లారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికీ వెరవకుండా వివిధ రూపాల్లో పోరాటాన్ని కొనసాగించారు.

అమరావతి పరిరక్షణ కోసం రైతులు ఇప్పుడు దేశ రాజధాని దిల్లీ వరకు తమ ఉద్యమ నినాదాన్ని వినిపించేందుకు సిద్ధమయ్యారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన చేసినందున కేంద్రానికి బాధ్యత ఉందని గుర్తుచేయనున్నారు. ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జంతర్‌మంతర్‌ వద్ద రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు బృందాలుగా విడిపోయి.. వివిధ పార్టీల అధ్యక్షులు, ఎంపీలను కలసి తమకు జరుగుతున్న అన్యాయం గురించి వివరిస్తారు. 19న రామ్‌లీలా మైదానంలో భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి ప్రత్యేక రైలులో దిల్లీ నుంచి బయలుదేరి 21వ తేదీ ఉదయానికి విజయవాడ చేరుకుంటారు.

రాజధాని ఉద్యమంలో ఇప్పటి వరకు పోలీసులు దాదాపు 3 వేల మందికి పైగా కేసులు నమోదు చేశారు. వారిలో ఒక్కొక్కరిపై 20-30 కేసులు నమోదైనవారూ ఉన్నారు. వాటిలో పలు ఎస్సీ, ఎస్టీ కేసులూ ఉన్నాయి. ఎస్సీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం, హైకోర్టు చివాట్లు పెట్టడం వంటి ఘటనలూ అనేకం. అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలయ్యాక ఇప్పటి వరకు దాదాపు 200మందికి పైగా రైతులు, రైతు కూలీలు మానసిక వేదనతో మరణించారు.

అమరావతి ఉద్యమంలో మహిళలదే కీలక పాత్ర. కొండలు.. గుట్టలు ఎక్కి.. ముళ్ల పొదలను తొలగించుకుంటూ.. కాల్వలను దాటుకుంటూ లక్ష్యాలను ఛేదించారు. పండగలు, జాతీయ పర్వదినాలు ఇలా ఏ కార్యక్రమమైనా ఉద్యమ శిబిరాలనే వేదికలుగా మలచుకున్నారు. రైతుల ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతుగా నిలిచాయి. ఆయా పార్టీల అగ్రనేతలు రాజధానిలో పర్యటించి రైతులకు సంఘీభావం ప్రకటించారు. తమ ఉద్యమం మూడేళ్లు పూర్తి చేసుకున్న సమయంలో.. అమరావతి ఆక్రోశాన్ని దిల్లీస్థాయిలో రైతులు వినిపిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 17, 2022, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.