డీఎడ్ యాజమాన్య కోటా విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనుమతించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు డిమాండ్ చేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం 2018 బ్యాచ్ డీఎడ్ వారిని పరీక్ష రాసేందుకు అనుమతించకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో కళాశాల యాజమాన్యాలు, ప్రభుత్వం ఆటలాడుకోవద్దని కోరారు. ధర్నాలో పాల్గొన్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పరీక్షల కోసం డీఎడ్ యాజమాన్య కోటా విద్యార్థుల ఆందోళన
గుంటూరు కలెక్టరేట్ వద్ద డీఎడ్ మేనేజ్మెంట్ కోటా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రెండేళ్లు కోర్సు పుర్తి చేసిన తమకు పరీక్షలకు అనుమతించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోరారు.
పరీక్షల కోసం డీఎడ్ యాజమాన్య కోట విద్యార్థుల ఆందోళన