గుంటూరు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రైతు కాశిమళ్ల బిక్షం.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బిక్షంకు ఉన్న 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే పంట దిగుబడి సరిగా రాకపోవడంతో చేసిన అప్పలులు తీర్చలేకపోయాడు. గత కొంత కాలంగా అప్పులతో ఇబ్బంది పడేవాడని.. ఈ క్రమంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: