గుంటూరు జిల్లా ఏటీ అగ్రహారానికి చెందిన రమాదేవి... కొన్నాళ్లుగా చెడు అలవాట్లకు బానిసైంది. ఇంట్లో వారి మాటలను లెక్కచేయకుండా తిరుగుతుండేది. ఎంతమంది నచ్చజెప్పినా.. ప్రయోజనం లేక.. ఇంట్లో వారు ఆమెను వదిలేశారు. రమాదేవికి ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు. ఈ కారణంగా.. తల్లి భూలక్ష్మి.. కుమార్తె రమాదేవితో పాటు.. ఏడేళ్ల వయసున్న మనవడు రాహుల్బాగోగులు చూసుకుంటోంది. ఈ క్రమంలో రాహుల్ అన్నం తినకుండా మారాం చేశాడని.. అతడిని భూలక్ష్మి ఒక దెబ్బ కొట్టింది. అప్పుడే ఇంటికి వచ్చిన రమాదేవి.. ఎందుకు ఏడుస్తున్నావని కుమారుడిని అడగ్గా.. అమ్మమ్మ కొట్టిందని చెప్పాడు.
కోపంతో రగిలిపోయిన రమాదేవి క్షణికావేశంలో తల్లి గొంతు నులిమి మంచం మీదకు పడవేసి విచక్షణా రహితంగా దాడి చేసింది. ఆ తరువాత ఆమెను ఈడ్చుకుంటూ లాక్కొని వెళ్లింది. ఈ క్రమంలో.. ఊపిరాడక భూలక్ష్మి ఇబ్బందికి గురైంది. గమనించిన స్థానికులు.. భూలక్ష్మిని జీజీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నగరంపాలెం సీఐ మల్లికార్జున రావు తెలిపారు.
ఇదీ చదవండి: