కన్నతండ్రికి అంత్యక్రియలు నిర్వహించి కొడుకు లేని లోటును తీర్చింది ఓ కుమార్తె. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన సాంబశివరావుకు ఒక్కగానొక్క కూతురుంది. ఆమెను ఉన్నత చదువులు చదివించాడు. వైద్య వృత్తిరిత్యా భర్తతో కలిసి సాంబశివరావు కూతురు మాలతి కేరళలో ఉంటున్నారు. తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని తెలిసి మాలతి ఉండవల్లికి వచ్చింది. మాలతి వచ్చిన మరసటి రోజే సాంబశివరావు గుండెపోటుతో మృతి చెందాడు. మాలతి అన్నీ తానై వ్యవహరించి... తన తండ్రి చితికి నిప్పంటించారు. ఈ సమయంలో సాంబశివరావు బంధువులంతా భావోద్వేగానికి లోనయ్యారు.
ఇదీ చదవండీ...