అసైన్డ్ భూముల వ్యవహారంలో గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టిన కేసు.... న్యాయస్థానాలలో నిలబడదని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ చెప్పారు. వెలగపూడి ఐకాస కార్యాలయంలో రాజధాని ఎస్సీ రైతులు, నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 29 గ్రామాల్లోని ఎస్సీ రైతులు హాజరయ్యారు.
గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.41లేకపోతే రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ భూములను ఇప్పటి ప్రభుత్వం గంపగుత్తగా తన బినామీలకు అప్పగించేందని న్యాయవాది లక్ష్మీనారాయణ చెప్పారు. ఎస్సీలకు మనుగడ లేకుండా చేసేందుకు వైకాపా ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని రైతుల ఐకాస ఆరోపించింది. ఎస్సీలకు కేటాయించిన టిడ్కో ఇళ్లను వెంటనే ఇవ్వాలని, వైకాపా ప్రభుత్వం చెప్పిన విధంగా భూమిలేని నిరుపేదలకు నెలకు 5ఇస్తామన్న హామిని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:
ఎవరైనా ఒక్కటే.. మాస్క్ పెట్టుకోని ట్రాఫిక్ సీఐకి ఎస్పీ జరిమానా