ETV Bharat / state

మూడు రాజధానులకు మద్దతుగా దళిత సంఘాల నిరసన

గుంటూరు జిల్లాలో మూడు రాజధానులకు మద్దతుగా దళిత సంఘాల నేతలు నిరసన చేపట్టారు. తెదేపా అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

Rally in support of the three capitals
మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ
author img

By

Published : Oct 25, 2020, 10:38 AM IST

రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మూడు రాజధానులు కావాలంటూ గుంటూరులో దళిత సంఘాల నేతలు నిరసన చేశారు. బహుజన ఐక్య వేదిక, ఆలిండియా దళిత్ ఉమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలు గుంటూరు లాడ్జి సెంటర్ నుంచి శంకర్ విలాస్ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. అమరావతి రాజధానిగా కొనసాగాలంటున్న చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెదేపా అధినేత దిష్టిబొమ్మను తగలపెట్టేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.

పాలన వికేంద్రీకరణ ద్వారా జగన్ దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్నారని బహుజన ఐక్య వేదిక నాయకులు అన్నారు. అమరావతిలో చంద్రబాబు తమకు కనీసం నిలువ నీడ లేకుండా చేశారన్నారు. మూడు రాజధానులతో దళితులకు ప్రయోజనం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

'రూ.వేలు పెట్టుబడి పెట్టినా... వడ్ల గింజ కూడా దక్కలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.