వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే తమ లక్ష్యమని సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఆయన నూతనంగా బేకరీ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశారు. కరోనా సమయంలో ఆరోగ్యానికి రక్షణ కలిగించే నాలుగు రకాల బాదం పాలను మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పటికే వాటికి ప్రజల్లో మంచి ఆదరణ లభించిందని వివరించారు. విజయవాడకు చెందిన బీటీ బేకరీ సంఘంతో కలిసి గుంటూరులోనూ ఉత్పత్తుల విక్రయం చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: