హైదరాబాద్ శివారు శంషాబాద్ దారుణ హత్యను సవాల్ గా తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మృతదేహం తమ కుమార్తెదే అని చెప్పడంతో దర్యాప్తు వేగవంతం చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. 10 బృందాలతో... సీసీ కెమెరా దృశ్యాల సాయంతో 48 గంటల్లోనే కేసును ఛేదించామని వివరించారు. కేసులో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు... నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలానికి చెందిన వారిగా గుర్తించారు.
సాయం చేస్తామని నటించి...
నిందితులు తరచుగా తెలంగాణ నుంచి మెటీరియల్ తరలిస్తుంటారని... ఆరోజు జరగాల్సిన అన్ లోడ్ అవ్వకపోవడంతో నిందితులు అక్కడ బస చేశారని సీపీ వివరించారు. సాయంత్రం 6 గంటల సమయంలో బాధితురాలిని గమనించిన నిందితులు... అప్పటి నుంచే యువతిపై అఘాయిత్యానికి కుట్రపన్నినట్లు తెలిపారు. సాయం చేస్తున్నట్లు నటించేందుకే నిందితులు ముందే ఆమె వాహనంలో గాలి తీసి ఈ అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు విజ్ఞప్తి చేస్తాం...
ఈ కేసు విచారణ వేగవంతం చేసిన కఠిన శిక్షలు పడేలా చూసేందుకు... పాస్ట్ ట్రాక్ కోర్టుకు విజ్ఞప్తి చేస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా డయల్ 100కు ఫోన్ చేయాలని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ కోరారు. మహిళలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు షి-టీమ్ కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: షాద్నగర్ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు