ETV Bharat / state

కూలిన కరెంటు స్తంభాలు... తప్పిన ప్రమాదం - Bhapatla latest news

రహదారి విస్తరణలో భాగంగా ఓ ప్రైవేటు భవనాన్ని జేసీబీతో తొలగిస్తుండగా... ప్రమాదవశాత్తు రెండు స్తంభాలు కుప్పకూలాయి. గుంటూరు జిల్లా బాపట్లలో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదవశాత్తు కూలిన కరెంటు స్తంభాలు...తప్పిన పెను ప్రమాదం

author img

By

Published : Dec 12, 2020, 9:42 AM IST

గుంటూరు జిల్లా బాపట్ల పట్టణం రథం బజార్లో రహదారి విస్తరణ నిమిత్తం ఓ ప్రైవేటు భవనంలో కొంత భాగాన్ని సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో.. జెేసీబీ పై భాగం తగిలి ఒక్కసారిగా రెండు కరెంటు స్తంభాలు కుప్పకూలాయి. ఈ ఘటనతో.. స్థానికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు.

కూలిన స్తంభాలు ట్రాక్టర్​పై పడిన కారణంగా పెను ప్రమాదం తప్పింది. గతంలో ఇదే బజారులో రామానుజ కూటమి భవనాన్ని కూల్చే సమయంలోనూ పై అంతస్తు కూలడంతో నలుగురు గాయపడ్డారు. నెలల తరబడి జరుగుతున్న ఈ విస్తరణ పనుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి త్వరగా పనులు పూర్తి చేసేలే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

కుటుంబంలో స్వల్ప వివాదం.. మనస్తాపంతో ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.