ETV Bharat / state

Crucial Monday in Chandrababu Cases: చంద్రబాబుకు కీలక సోమవారం.. టీడీపీ శ్రేణులలో తీవ్ర ఉత్కంఠ

Crucial Monday in Chandrababu Cases: తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సంబంధించి వివిధ కేసుల్లో సోమవారం తీర్పులు వెలువడనున్నాయి. అదే విధంగా సుప్రీంలో విచారణ సైతం ఉంది. దీంతో రేపు ఏం జరగనుందో అని తెలుగుదేశం శ్రేణులు మాత్రమే కాకుండా యావత్ రాష్ట్రం ఎదురుచూస్తోంది. కోర్టులలో ఎటువంటి తీర్పు వస్తుందోనని ప్రజలంతా ఉత్కంఠగా చూస్తున్నారు.

Crucial Monday in Chandrababu Cases
Crucial Monday in Chandrababu Cases
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 8, 2023, 11:22 AM IST

Crucial Monday in Chandrababu Cases: టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన కేసుల్లో సోమవారం కీలకం కానుంది. దిగువ కోర్టు నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలు, తీర్పులు వెలువడనున్నాయి. నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై సోమవారం విచారణ ఉంది.

కాగా స్కిల్‌ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై (Chandrababu Quash Petition in Supreme Court) తదుపరి విచారణను సుప్రీంకోర్టు 9వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌కు సంబంధించి.. ఏపీ హైకోర్టుకు సీఐడీ సమర్పించిన డాక్యుమెంట్లను తమ ముందు ఉంచాలని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఈ కేసులో రేపు విచారణ జరగనుంది.

Chandrababu Quash Petition Hearing on SC: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ఇక ఇదే కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు వేసిన బెయిలు పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు సోమవారమే నిర్ణయాన్ని వెల్లడించనుంది. దీంతో పాటు మరోసారి పోలీసు కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై సైతం సోమవారం ఏసీబీ కోర్టు తగిన ఉత్తర్వులు జారీచేయనుంది.

స్కిల్ డెవలప్​మెంట్ కేసులో (Skill Development Case) చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై (CBN Bail and Custody Petitions in ACB Court) విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగియగా.. న్యాయమూర్తి తీర్పును సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. సీఐడీ తరఫున వాదనలు ఏఏజీ పొన్నవోలు వినిపిస్తూ.. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్నారు. అదే విధంగా దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే.. చంద్రబాబును ఇప్పటికే పోలీసు కస్టడీకి ఇచ్చారని వాదించారు.

Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు

హైకోర్టులోనూ సోమవారం చంద్రబాబుకు సంబంధించిన మూడు బెయిలు పిటిషన్లపై తీర్పులు వెల్లడికానున్నాయి. రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు (Angallu Case), ఫైబర్‌ నెట్‌ కేసుల్లో (AP FiberNet Case) బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి తీర్పులను రిజర్వు చేసిన సంగతి తెలిసిందే.

అమరావతి రింగ్ రోడ్ కేసులో (Amaravati Inner Ring Road Case) తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ (High Court Hearing on Chandrababu Cases) జరిపి.. తీర్పుని రిజర్వు చేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్‌ లూథ్రా వర్చువల్​గా వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వులో ఉంచింది. అమరావతి రింగ్ రోడ్ ప్రాజెక్టులో ఒక్క అడుగు భూమి కూడా సేకరించలేదని చంద్రబాబు న్యాయవాది సిద్ధార్ద్ వాదనలు వినిపించారు. ఈ మూడు పిటిషన్లలో సోమవారం న్యాయమూర్తి నిర్ణయం వెల్లడించనున్నారు.

CBN Bail Petition చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పు సోమవారానికి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.