వరదతో గుంటూరు జిల్లా కృష్ణా పరీవాహక లంక ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయి. వరద తగ్గుముఖం పట్టినా ఇంకా నీటిలోనే పంటలు ఉన్నాయి. అరటి, పసుపు, కంద, కూరగాయ పంటలు పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క పంటకు ఎకరానికి లక్ష రూపాయలు దాకా పెట్టుబడి పెట్టామనీ.. ఇప్పుడీ వరద వల్ల పాడైన పంటతో ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలనీ.. వెంటనే పరిహారం చెల్లించాలని కోరారు.
ఇవీ చదవండి..