కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి విగ్రహాలు.. లోడ్ చేసుకుని వెళుతున్న మినీ లారీ గత నెల 27వ తేదీ రాత్రి పెట్లూరివారిపాలెం సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో మినీ లారీ డ్రైవర్ మృతి చెందాడు. లారీలో ఉన్న విగ్రహాలను కిందకు దించి వేరే లారీలో తీసుకువెళ్లారని నరసరావుపేట గ్రామీణ పోలీసులు తెలిపారు.
ప్రమాదంలో ధ్వంసమైన అమ్మవారి విగ్రహాన్ని వదలివెళ్లారని వెల్లడించారు. ఆ విగ్రహాన్ని బుధవారం సమీపంలోని పొలాల వాళ్లు రోడ్డు పక్కన పెట్టడంతో విషయం బయటకు వచ్చిందన్నారు. ఎవరూ విగ్రహాన్ని ధ్వంసం చేయలేదని వివరించారు. దేవాలయాల వద్ద విగ్రహాలు ధ్వంసం చేయడం లాంటివి జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: