గుంటూరులోని ప్రభుత్వ భూముల విక్రయానికి నిరసనగా సీపీఎం పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు వినయోగించాలని నాయకులు కోరారు. గుంటూరు పీవీకె నాయుడు కూరగాయల మార్కెట్ పై వేలాది మంది చిరు వ్యాపారులు ఆధారపడి జీవిస్తున్నారని... ఆ భూములు అమ్మితే వారంతా వీధిన పడతారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనగర్‌లోని కార్మిక శాఖకు చెందిన భూమిని.. నల్లపాడు రోడ్డులో వున్న విలువైన భూములను విక్రయానికి పెట్టడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆదాయాలను పెంచుకోవడానికి మార్గాలను అన్వేషించాలని... పన్నులు ఎగ్గొడుతున్న వారిని గుర్తించి వారిపై పన్నులు వేసి ఆదాయాలను పెంచుకోవాలని సూచించారు.
ఇదీచూడండి. 'వైకాపా నేతలకు అలవాటుగా మారిపోయింది'