లాక్ డౌన్ తో తినడానికి తిండి లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మద్యం షాపులు తెరవాల్సిన అవసరం ఏంటని సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రశ్నించారు. లిక్కర్ షాపులు తెరిచి ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆక్షేపించారు.
తక్షణమే మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వైకాపా ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఉపాధి కోల్పోయిన కార్మికులను తక్షణమే ఆదుకోవాలన్నారు.
ఇదీ చదవండి: