బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ స్థలాల అమ్మకాలపై సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భవిష్యత్తు తరాల కోసం ఉపయోగపడాల్సిన స్థలాల్ని అమ్మటంపై తెదేపా, వామపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గుంటూరులో కీలకమైన కూరగాయల మార్కెట్‌ను బిల్డ్ ఏపీ పేరుతో అమ్మటంపై శాసనమండలి సభ్యులు రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు మార్కెట్ స్థలాన్ని కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. పది వేల మందికి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే మార్కెట్‌ను వేలం వేయటం అంటే... వారందరినీ రోడ్డున పడేయటమేననని సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి...