కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. గుంటూరులో సీపీఐ ఎంఎల్ రాష్ట్రస్థాయి సదస్సుకు హాజరైన ఆయన..ఈసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని రామకృష్ణ ఆరోపించారు. స్వతంత్ర సంస్థ అయిన ఈసీఐ... భాజపా అనుకూల నిర్ణయాలు తీసుకోసుకుంటోందని ఆరోపించారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని హితవుపలికారు. ప్రజల్లో నమ్మకం కల్గించేలా ఈసీ నిర్ణయాలు ఉండాలని రామకృష్ణ కోరారు.
ఇవీ చూడండి : ఈ నెల 19న గుంటూరులో ఉపరాష్ట్రపతి పర్యటన