ETV Bharat / state

'సెలక్ట్ కమిటీ పరిశీలనలో ఉన్నప్పుడు సభలో తీర్మానం ఎలా చేస్తారు' - సీఆర్డీఏ బిల్లుపై సీపీఐ రామకృష్ణ వ్యాఖ్యలు వార్తలు

సీఆర్డీఏ బిల్లు రద్దు అంశం సెలక్ట్ కమిటీ పరిశీలనలో ఉన్నప్పుడు సభలో తీర్మానం ఎలా పెడతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాసనసమండలి ఛైర్మన్ ఈ బిల్లును మళ్లీ తిప్పి పంపాలని కోరారు. అలాగే అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

cpi ramakrishna comments on crda bill on assembly
సీపీఐ రామకృష్ణ
author img

By

Published : Jun 17, 2020, 3:52 PM IST

సీఆర్డీఏ బిల్లు రద్దు అంశం సెలక్ట్ కమిటీ పరిశీలనలో ఉన్నప్పుడు సభలో తీర్మానం ఎలా పెడతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్​లో ఉన్న ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఇతర సీపీఐ నేతలను రామకృష్ణ పరామర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం మరోసారి తప్పులు చేస్తోందని ఆక్షేపించారు. శాసనసమండలి ఛైర్మన్ ఈ బిల్లును మళ్లీ తిప్పి పంపాలని రామకృష్ణ కోరారు.

'అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు తీర్చాలని సీఎంకు ప్రశాంతంగా వినతిపత్రం ఇచ్చే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవు. గత బడ్జెట్​లో కేటాయించిన రూ. 1100 కోట్లు ఇచ్చుంటే చాలావరకు సమస్యలు తీరేవి.. అవీ ఇవ్వలేదు. ఈ బడ్జెట్​లోనూ బాధితుల కోసం సరైన కేటాయింపులు లేవు. సీఆర్డీఏ అంశం సెలక్ట్ కమిటీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం ఎలా చేస్తారు. శాసనమండలి ఛైర్మన్ మరలా దాన్ని తిప్పి పంపాలని మేం కోరుతున్నాం.'-- సీపీఐ రామకృష్ణ

ఇవీ చదవండి...

జోరందుకున్న ఆటోమొబైల్ అమ్మకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.