ఆస్తిపన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ గుంటూరులో సీపీఐ నేతలు నిరసన చేపట్టారు. గుంటూరు లాడ్జీ సెంటర్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. పన్ను పెంపు వల్ల నగరవాసులకు కలిగే నష్టాలను వివరించారు. ప్రజలపై భారం మోపే జీవోలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని సీపీఐ నేత జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: బర్డ్‌ప్లూ కలకలంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు