కృష్ణా నది వరద ప్రభావ ప్రాంతాల్లో తీవ్రంగా పంటలు, నివాసాలు నష్టపోయిన బాధితులకు వెంటనే పరిహారం అందించి, ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. రైతు సంఘాల నాయకులు, సీపీఐ నేతలతో కలిసి.. రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను కలిసి, వినతిపత్రం అందజేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో పర్యటించి రైతుల స్థితిగతులను పరిశీలించాలని కోరారు. బాధితుల్లో 75 శాతం మంది కౌలు రైతులే ఉన్నారన్న రామకృష్ణ... వారిని ఆదుకోడానికి ఎకరానికి రూ. 20వేల నుంచి రూ. 25 వేలు పరిహారం ప్రకటించాలన్నారు. వరదలతో పత్తి, మినప రైతులు తీవ్రంగా నష్టపోయారని, తిరిగి పంటలు వేసుకునేలా ఆర్థికసాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: