లాక్‌డౌన్ లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీసిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు. మద్యం విక్రయాలు ఆపకపోతే రాష్ట్రం.. కరోనా విషయంలో మరో న్యూయార్క్ అవుతుందని అభిప్రాయపడ్డారు. మందు అమ్మకాల వల్ల కరోనా కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కిలోని రూరల్ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు. కరోనాపై విజయం సాధించేందుకు ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించాల్చిన ప్రభుత్వం.. మద్యం అమ్మకాలకు అనమతులివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: