అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ గుంటూరులో సీపీఐ ఆందోళన నిర్వహించింది. శంకర్ విలాస్ కూడలి రోడ్డుపై పడుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు రాజధానుల బిల్లులను రాష్ట్రపతి ఆమోదించవద్దని డిమాండ్ చేశారు. రాజధాని ఇక్కడే ఉంటుందని ఎన్నికల ముందు చెప్పిన వైకాపా.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరిట దుర్మార్గపు ఆలోచన చేసిందని సీపీఐ నేత అజయ్ కుమార్ విమర్శించారు. వైకాపా ఆడుతున్న నాటకానికి భాజపా సహకరిస్తోందని ఈ రెండుపార్టీల ఆట కట్టించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి