ETV Bharat / state

గుంటూరులో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్

author img

By

Published : Jan 2, 2021, 3:40 PM IST

Updated : Jan 2, 2021, 4:37 PM IST

గుంటూరులో కరోనా వ్యాక్సిన్ పై డ్రైరన్ నిర్వహించారు. ముందుగా ఎంపిక చేసిన వారికి ఉదయం 9 గంటల తర్వాత వ్యాక్సిన్ అందించారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే వారిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్​ను అందుబాటులో ఉంచారు.

గుంటూరులో కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ ప్రారంభం

గుంటూరులో కరోనా వ్యాక్సిన్​పై డ్రై రన్ నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి వ్యాక్సిన్​కు కోల్డ్ బాక్స్​లో టాస్క్​ఫోర్స్ బృందం ఎంపిక చేసిన కేంద్రాలకు తరలించారు. జిల్లాలో వేదాంత ఆస్పత్రి, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ఎస్​కెబీఎం స్కూల్​లో డ్రై రన్ కొనసాగిస్తున్నారు. ప్రతి కేంద్రంలో 25 మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ముందుగా ఎంపిక చేసిన వారికి ఉదయం 9 గంటలకు వ్యాక్సిన్ అందించారు.

వ్యాక్సిన్ అనంతరం వారిని ఆరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు తలెత్తినా...వారి సమస్యలను ఆన్​లైన్​లో నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆరోగ్య సమస్య తలెత్తిన వారిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్​ను అందుబాటులో ఉంచారు.​

ఇదీ చదవండి

జిల్లాలో మరో 41 మందికి కరోనా పాజిటివ్

Last Updated : Jan 2, 2021, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.