కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే.. వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని అహల్య ఆసుపత్రి వైద్యులు డాక్టర్. ఉమాశంకర్ అన్నారు. గుంటూరు అహల్య ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు పేదలకు వెయ్యి డోసుల పైగా వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్నామని చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్ పై అపోహలు వీడి.. దైర్యంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆసుపత్రి గైనగాలజిస్ట్ రాజకుమారి తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కొద్దిగా ఒళ్లు నొప్పులు, జ్వరం ఉంటడం సహజమన్నారు.
ఇదీ చదవండి: తెనాలి పురపాలక సంఘం నూతన పాలకవర్గ అత్యవసర సమావేశం