ETV Bharat / state

మంగళగిరి ఎయిమ్స్​లో కొవిడ్ టీకా ప్రారంభం

గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో కొవిడ్ టీకా ప్రారంభమైంది. ఎయిమ్స్​ సంచాలకులు డాక్టర్ ముఖేశ్​ త్రిపాఠి టీకా ప్రక్రియను మొదలు పెట్టారు.

covid vaccination begins
కొవిడ్ టీకా ప్రారంభం
author img

By

Published : Jan 18, 2021, 2:50 PM IST

మంగళగిరి ఎయిమ్స్​లో కొవిడ్ టీకా ప్రారంభమైంది. ఆస్పత్రి సంచాలకులు డాక్టర్ ముఖేశ్​ త్రిపాఠి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి కొవిషీల్డ్ టీకాను డాక్టర్ ముఖేశ్​, నర్సింగ్ అధికారి ధనశేఖరన్, ఎయిమ్స్ డీన్ డా.జాయ్ తీసుకున్నారు. ఆస్పత్రిలోని వైద్యులు, నర్సులకు టీకాను అందిస్తామని డా. ముఖేశ్​ చెప్పారు. టీకా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్​ రావని..అత్యంత సురక్షితమైనదని చెప్పారు. ఎలాంటి భయం లేకుండా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్​ తీసుకున్నప్పటికీ మాస్క్ ధరించటం​, శానిటైజేషన్​, భౌతిక దూరం పాటించాలని తెలిపారు.

ఇదీ చదవండి:

'లక్ష్యం పూర్తయ్యే వరకు టీకా పంపిణీ కొనసాగుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.