ETV Bharat / state

తెనాలి మున్సిపాలిటీలోని ముగ్గురు అధికారులకు కరోనా - tenali municipal commissioner news

గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీ పరిధిలోని ముగ్గురు అధికారులకు కొవిడ్​ పాజిటివ్​ నిర్ధారణ అయ్యింది. వారిని హోమ్​ క్వారంటైన్​లో ఉంచినట్లు మున్సిపల్ కమిషనర్ యమ్. జశ్వంత రావు తెలిపారు.

municipal commissioner
మున్సిపల్ కమిషనర్ యమ్. జశ్వంత రావు
author img

By

Published : Mar 16, 2021, 4:23 PM IST

తెనాలి మున్సిపాలిటీలోని ముగ్గురు అధికారులకు కరోనా సోకినట్లు మున్సిపల్ కమిషనర్ యమ్.జశ్వంత రావు తెలిపారు. వారిని హోమ్ క్వారంటైన్​లో ఉంచినట్లు చెప్పారు. వారు ఇప్పటికే కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎక్కువ మందితో కలిసి పనిచేయటం వల్ల వైరస్​ సోకి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

కొవిడ్​ నిబంధనలు ప్రకారం మున్సిపల్​ కార్యాలయం మొత్తాన్ని శానిటైజేషన్ చేసినట్లు కమిషనర్ వివరించారు. మిగిలిన సిబ్బంది విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కరోనా మహమ్మారి రెండోదశలో వ్యాప్తి ఎక్కువైతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి.. భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 147 కరోనా కేసులు..ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.