తెనాలిలోని జగ్గడిగుంటపాలెంలోని టిడ్కో గృహాల్లో ఏర్పాటుచేసిన కోవిడ్ హెల్త్ కేర్ సెంటర్ నుంచి ఓ వ్యక్తి బయటికి వెళ్లిపోయాడు. తర్వాత ఆయన దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు వద్ద మృతి చెంది ఉన్నాడు. అతడిది గుంటూరు జిల్లా తెనాలి పట్టణం సుల్తానాబాద్‌కు చెందిన బత్తుల బుజ్జి(51) అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు ఘటనా స్థలానికి వెళ్లారు. కొన్ని రోజుల క్రితం బుజ్జికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన జగ్గడిగుంటపాలెం సమీపంలో టిడ్కో గృహాల్లోని కొవిడ్ కేర్ కేంద్రంలో చికిత్స తీసుకున్నాడు.
వైరస్ సోకిందని మనస్థాపానికి గురైన ఆయన… గత రాత్రి కొవిడ్ కేర్ కేంద్రం నుంచి బయటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం రేవేంద్రపాడు కాలువ వద్ద ఆత్మహత్య చేసుకోవడానికి ఆయన పలుమార్లు కాలువలో దిగాడని స్థానికులు తెలిపారు. కానీ ధైర్యం సరిపోక బయటకు వచ్చి పక్కనే ఉన్న దిమ్మపై కూర్చున్నాడు. నీరసంగా ఉన్న అతన్ని గుర్తించి స్థానికులు భోజనం పెట్టారు. అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన మృతి చెందాడని స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తమ ఇంటికి తీసుకువెళ్లిపోయారు.
ఇదీ చూడండి: