గుంటూరు జిల్లాలోని పలు పాఠశాలల్లో కరోనా ఘంటికలు మోగుతున్నాయి. విద్యాలయాల ప్రారంభంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో.. వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాడికొండ నియోజకవర్గంలో పది మంది విద్యార్థులకు కొవిడ్ నిర్ధారణ అయ్యింది. ఫిరంగిపురం ప్రైవేట్ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు, నుదురుపాడులో, మేడికొండూరు మండలంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయులకు మహమ్మారి సోకినట్లు తేలింది. కొర్రపాడు, సిరిపురం, మందపాడు పరిధిలోని పాఠశాలల్లో ఐదుగురు, తుళ్లూరు మండలంలో నలుగురు విద్యార్థులు వైరస్ బారిన పడినట్లు వెల్లడైంది.
ఇదీ చదవండి: దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు అరెస్ట్