రేషన్ దుకాణాల్లో ఆన్లైన్ సర్వర్ సమస్యలతో పంపిణీలో జాప్యం జరుగుతోంది. ఈ సమస్యతో గుంటూరులోని చౌక దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో కొన్ని దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించడం సాధ్యం కావడం లేదు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్నా...సరుకులు అందటం లేదని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డు వాలంటీర్ల ద్వారా రేషన్ పంపిణీ చేయాలని కోరుతున్నారు.
రేషన్ దుకాణాలను పరిశీలిస్తున్న అధికారులు సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కొన్నిచోట్ల పోర్టబులిటీ కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. 15 రోజులకోసారి సరకులు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సరఫరా చేసేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందని వివరిస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తున్న నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.
అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా... 3వ రోజు కూడా రేషన్ లబ్ధిదారులకు అవస్థలు తప్పలేదు. సరకుల కోసం బారులు తీరి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యకు సత్వర పరిష్కారం చూపాలని కార్డుదారులు కోరుతున్నారు.
ఇదీచదవండి