ETV Bharat / state

ఆర్టీసీ ఉద్యోగుల్ని కలవరపెడుతున్న కరోనా

ఆర్టీసీ ఉద్యోగులను కరోనా భయం వెన్నాడుతోంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల డిపోలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో మిగతా ఉద్యోగులు తమకు సెలవులు మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. పని ప్రదేశంలో కనీస రక్షణ చర్యలు లేవని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల్లో కరోనా ఆందోళన
ఆర్టీసీ ఉద్యోగుల్లో కరోనా ఆందోళన
author img

By

Published : Jul 3, 2020, 3:24 PM IST

ఆర్టీసీ ఉద్యోగుల్ని కలవరపెడుతున్న కరోనా

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. లాక్​డౌన్​ సడలింపుల తర్వాత వైరస్ ఉద్ధృతి తీవ్రమైంది. సడలింపులతో తిరిగి సేవలు ప్రారంభించిన ఆర్టీసీపైనా కరోనా ప్రభావం పడింది. ప్రయాణికులు లేక నష్టాలు ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే...ఆర్టీసీ ఉద్యోగులు సైతం వైరస్ బారిన పడుతున్నారు. లాక్​డౌన్​ సమయంలోనూ ఆర్టీసీ ఉద్యోగులు పోలీసులకు సహాయంగా కరోనా విధులు నిర్వహించారు.

పిడుగురాళ్ల డిపోలో కరోనా కలకలం

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల డిపో గ్యారేజిలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా సోకింది. దీంతో ఇతర ఉద్యోగులలో ఆందోళన నెలకొంది. అధికారులు కనీస పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించకుండా పని చేయిస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. మరికొందరిలోనూ కరోనా అనుమానిత లక్షణాలు కనిపించాయంటున్నారు. గ్యారేజిలో మెకానికల్ ఫోర్​మెన్​గా పని చేస్తున్న ఓ ఉద్యోగి డిపో మేనేజర్​పై ఆగ్రహం వెలిబుచ్చారు. తనను ఇంట్లోకి రానీయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్యారేజిలో కనీసం శానిటైజర్లు, మాస్కులు కూడా అందుబాటులో లేవని... ఈ పరిస్థితుల్లో ఎలా పని చేయాలని నిలదీశారు. ఈ పరిణామాలపై ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరికి పాజిటివ్​గా తేలిందని... తమకు కరోనా పరీక్షలు చేయించాలని కోరుతున్నారు.

సెలవులివ్వాలని వేడుకోలు

'నా తోటి ఉద్యోగికి కరోనా సోకింది. అయినా అధికారులు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. కరోనా నివారణ చర్యలు చేపట్టడం లేదు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదా?. మీ కాళ్లు పట్టుకుంటాం. సెలవులు పెట్టుకునేందుకు అవకాశం కల్పించండి' అని ఓ ఉద్యోగి డిపో మేనేజర్ కాళ్లపై పడ్డారు. దీంతో సహోద్యోగులు అతన్ని ఓదార్చారు.

ఆర్టీసీ ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనకు ఈ ఘటనలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కరోనా నివారణ చర్యలు చేపట్టకపోవటంపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 50 ఏళ్లకు పైబడిన ఉద్యోగులు, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు విధులకు రావాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ డిపోల స్థాయిలో అధికారులు మాత్రం వాటిని పట్టించుకోవటం లేదు.

ఇదీ చదవండి : పదవిని మూణ్ణాళ్ల ముచ్చట చేసుకోవద్దు: ముద్రగడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.