ETV Bharat / state

లాక్ డౌన్ ఎఫెక్ట్.... హోటల్ వైపు చూడని ఆహార ప్రియులు - హోటళ్లపై లాక్ డౌన్ ప్రభావం తాజా వార్తలు

కరోనాకు ముందు.... అబ్బ ఇంట్లో ఇడ్లీ ఏం తింటాంలే... బజారుకు వెళ్లి వేడివేడిగా దోశ లాగించేద్దాం. రోజూ అదే కాఫీనా. పక్కనే ఉన్న బండి వద్ద అల్లం ఛాయ్ తాగుదాం... ఉప్మా తినితినీ మొహం మొత్తింది.. చక్కగా బాబాయ్ హోటల్​కెళ్లి.. పొంగిన పూరీలు ఒక పట్టు పడదాం.. ఇదీ సగటు ఆహార ప్రియుడి ఆలోచన. కరోనా తర్వాత... ఇంటి ఇడ్లీలో కారప్పొడి, నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి హోటల్లో ఎందుకొస్తుంది... వేడివేడి పాలల్లో కాఫీ పొడి వేసుకుని, కుటుంబసభ్యులతో కబుర్లు చెప్తూ తాగుతుంటే ఆ ఆనందం ఛాయ్ బండి దగ్గర ఎందుకుంటుంది.. ఇదీ ప్రస్తుతం మనిషి మనోభావన. ఆహా కావాలి నుంచి అబ్బే వద్దొద్దు అనేంతలా ప్రభావితం చేసింది కరోనా. మళ్లీ తిరిగి లేవడానికి ఎంతో సమయం పట్టేలా ఆతిథ్య రంగాన్ని చాచికొట్టింది. లాక్ డౌన్ హోటళ్లపై ఎలా ప్రభావం చూపిందనే దానిపై ప్రత్యేక కథనం.

లాక్ డౌన్ ఎఫెక్ట్.... హోటల్ వైపు చూడని ఆహార ప్రియులు

author img

By

Published : Jun 10, 2020, 9:53 PM IST

Updated : Jun 10, 2020, 10:17 PM IST

లాక్ డౌన్ కారణంగా దాదాపు 80 రోజులుగా హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకోలేదు. ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ హోటళ్లకు ఆశించిన రీతిలో స్పందన కనిపించడంలేదు. కరోనా భయంతో వినియోగదారులు.. నిర్వహణ, నష్ట భయంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు. రుచికరమైన, వైవిధ్యమైన వంటలకు పేరుగాంచిన గుంటూరులోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదు.

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్​తో అన్ని రంగాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి. ఈ ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లపై కాస్త అధికంగానే పడింది. దాదాపు 80 రోజులుగా అవి మూతపడ్డాయి. ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులతో అక్కడక్కడా హోటళ్లు తెరుచుకున్నప్పటికీ వ్యాపారం మాత్రం సజావుగా సాగడంలేదు.

నిర్వహణ, నష్టాల భయంతో గుంటూరులో సగం హోటళ్లు ఇప్పటికీ మూసే ఉన్నాయి. కొన్ని మాత్రమే తెరుచుకున్నాయి. వాటిల్లోనూ వ్యాపారం ఆశాజనకంగా లేదు. కరోనా భయంతో వినియోగదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరికొన్నాళ్లు ఇంటి వంటే మంచిదనే భావంతో రెస్టారెంట్లకు దూరంగా ఉంటున్నారు. హోటళ్ల యజమానులకు నిబంధనలు మరింత భారంగా మారాయి. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేయడం, శానిటైజర్లు ఉపయోగించడం వంటివి చేస్తున్నారు. వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క నిపుణులైన వంటవారి కొరత వేధిస్తోంది. గ్రామాల నుంచి వచ్చిన కూలీలు, వంటవారు స్వస్థలాలకు వెళ్లిపోయారు.

అయితే ఇప్పుడప్పుడే ఆతిథ్య రంగం కోలుకునేలా లేదని పలువురు హోటళ్ల యజమానులు అంటున్నారు. మూములు స్థితికి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని చెబుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మళ్లీ మునుపటిలా పుంజుకుంటామనే ఆశాభావం వ్యక్తంచేశారు.

ఇవీ చదవండి...

కరోనా ఎఫెక్ట్ : స్టీల్​, అల్యూమినియం పరిశ్రమలు డీలా

Last Updated : Jun 10, 2020, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.