ETV Bharat / state

'కంటైన్మెంట్ జోన్​లో సదుపాయాలు కల్పించాలి' - గుంటూరులో కరోనా కేసులు

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కంటైన్మెంట్ జోన్​లో సదుపాయలు కల్పించడం లేదని మహిళలు ఆందోళన చేశారు. దీంతో అధికారులు, స్థానిక మహిళ మధ్య గొడవ జరిగింది. కంటైన్మెంట్ జోన్​లో సౌకర్యాలు కల్పిస్తామని... ఎవరూ బయటకు రాకూడదని అధికారులు అన్నారు.

corona cases  increasing in sathenapalli
స్థానికుల ఆందోళన
author img

By

Published : Jul 9, 2020, 8:24 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ విజృంభిస్తున్నాయి. అధికారులు పలు ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ప్రకటించారు. సత్తెనపల్లి 8వ వార్డులోనూ కేసులు ఎక్కువ రావడంతో ఆ ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. అధికారులు కంటైన్మెంట్ ఏరియాలుగా ప్రకటించి.. మౌలిక సదుపాయాలు కల్పించడంలేదని మహిళలు ఆందోళన చేపట్టారు. అక్కడ ఉన్న అధికారులకు స్థానిక మహిళలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమస్యలను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పడంతో స్థానికులు ఆందోళనలు విరమించారు. కంటైన్మెంట్ ఏరియా నుంచి బయటకు ఎవరు రాకుండా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్.. ఉపాధి లేక.. వండ్రంగుల ఆకలి కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.