గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. జిల్లాలో 6 రోజుల్లో ఏకంగా 94 కేసులు నమోదయ్యాయి. 15 తేదీన నమోదైన 34 కేసుల్లో 23 కేసులు గుంటూరులోనే బయటపడ్డాయి. తాడేపల్లి మహానాడులో 9 కేసులు..పొన్నూరు, నరసరావుపేటలో ఒక్కో కేసు నమోదైంది. గుంటూరు ఏటీ అగ్రహారం, ఏఎన్యూ క్వారంటైన్ సెంటర్, వట్టిచెరుకూరు, పొన్నూరు, గుండెమెడ, ఏపీ ఎస్పీ బెటాలియన్లో ఇన్నర్ రింగ్ రోడ్డు, మొహిద్దీన్ పాలెం, లక్ష్మీపురం, కాకుమానువారితోట, వికాస్ నగర్, మల్లికార్జునపేట, బృందావన్ గార్డెన్స్, అనంతవరప్పాడు, ఏటుకూరు రోడ్డు ప్రాంతంలో కొత్త కేసులు నమోదయ్యాయి. కడప నుంచి వచ్చిన ఒకరు, విజయవాడ నుంచి వచ్చిన నలుగురికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది.
తాడేపల్లి, తెనాలి, మంగళగిరి, దుగ్గిరాల, బాపట్ల, చిలకలూరిపేట ప్రాంతాల్లో కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ ఉద్యోగికి కరోనా రాగా....జీజీహెచ్లో పీజీ వైద్యురాలు, మరో ఇద్దరు నర్సులకూ కొవిడ్ సోకింది. నగరంలోని ముత్యాలరెడ్డినగర్, ఎన్టీఆర్ నగర్, ఎల్బీనగర్, రాజుపాలెం మండలం ఇనుమెట్ల, దుగ్గిరాల, మంగళగిరి మండలం పెదవడ్లపూడి, సత్తెనపల్లి, పెదకాకాని మండలం నంబూరు, పొన్నూరు, నల్లపాడు, దాచేపల్లి-2, అచ్చంపేట మండలం మాదిపాడులో కొత్త కంటైన్మెంట్ జోన్లను గుర్తించారు. నరసరావుపేట, ప్రకాశ్ నగర్ 1,2, తెనాలి మండలం సుల్తానాబాద్, ఐతానగర్లను కంటైన్మెంట్ జోన్ల నుంచి మినహాయించారు. రికవరీ శాతం పెరుగుతుండగా... అదే సమయంలో కొత్త కేసులు బయటపడుతుండటం ఆందోళన కలుగుతోంది.
ఇదీ చూడండి.