గుంటూరు జిల్లా తాడేపల్లిలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా తాడేపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ కరకట్ట, ఉండవల్లి కూడలి, సీఎం నివాసానికి అతి సమీపంగా ఉన్న క్రిస్టియన్ పేటలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు వార్డు వాలంటీర్లు ఉన్నట్లు గుర్తించారు. వాలంటీర్లు ఇద్దరు గత మూడు రోజుల క్రితం తాడేపల్లిలోని వివిధ ప్రాంతాల్లో పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో పురపాలక అధికారులు శానిటేషన్ పనులు చేపట్టారు.
ఇదీ చవదండి: ఎల్‌జీ పాలిమర్స్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ వాయిదా