ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉండే తాడేపల్లిలో కరోనా పాజిటివ్ కేసులు పెరగుతున్న కారణంగా.. అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మంగళగిరి నుంచి తాడేపల్లి వచ్చే రహదారులను మూసివేయనున్నారు. తాడేపల్లిలో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లి పురపాలక సంఘం, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం వహించొద్దని అధికారులకు స్పష్టం చేశారు. తాడేపల్లికి వచ్చే అన్ని రహదారులను తక్షణమే మూసివేసి.. నివారణ చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. రెడ్ జోన్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: