![corona cases in narasarao peta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6955046_143_6955046_1587963929611.png)
కరోనా కేసులు అంతకంతకూ పెరగడంతో నరసరావుపేటలోని వరవకట్ట వాసులు వణికిపోతున్నారు. ఆదివారం రాత్రి నరసరావుపేటలో మరో పది పాజిటివ్ కేసులు నమోదైనట్లు నరసరావుపేట ఆర్డీవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. దీంతో నరసరావుపేటకులో కరోనా బాధితుల సంఖ్య 58కి చేరింది. పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని అంబులెన్స్‌లో ఎన్‌ఆర్‌ఐ కోవిడ్-19 ఆసుపత్రికి పంపి, వారి కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలించామని ఆర్డీవో తెలిపారు. వరవకట్టలో తొలి బాధితుడు మృతిచెందాడు. అతని కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి వైరస్ ఉన్నట్లు తేలింది. ఇదే ప్రాంతంలో నివశిస్తున్న హోంగార్డు దంపతులకు పరీక్షలు చేయగా వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారు. వరవకట్టలో ఒకే రోజు 20 పాజిటివ్ కేసులు వెలుగుచూడటం అధికారులను ఉలికిపాటుకు గురిచేసింది. ఆదివారం మరో 10 కేసులు నమోదయ్యాయి. దీంతో వరవకట్టలో మొత్తం బాధితులు 40 మంది తేలారు.
ఇవీ చూడండి...