గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న కొత్తగా 805 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 39వేల 891కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరంలోనే 102 వరకు ఉన్నాయి. మాచర్లలో 60, మంగళగిరిలో 58, నరసరావుపేటలో 45, ఫిరంగిపురంలో 40, రొంపిచర్లలో 38, తెనాలిలో 34, బాపట్లలో 29, వినుకొండలో 28, గురజాలలో 25, పొన్నూరులో 24, కొల్లూరులో 20, ఈపూరులో 17, పిడుగురాళ్లలో 15 చొప్పున కేసులు నమోదయ్యాయి. రెండ్రోజుల్లోనే 1894 కేసులు నమోదయ్యాయంటే కేసుల ఉద్ధృతిని చాటిచెబుతోంది. గుంటూరు జిల్లాలో నిన్న 9మంది కొవిడ్ వైరస్ ప్రభావంతో మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 396కి చేరింది.
ఇదీ చదవండి: "ఊరికి మొనగాళ్లు" పేరిట కథనం... స్పందించిన ప్రభుత్వం