గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 305 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 107 కేసులు గుంటూరు నగర పరిధిలోనే గుర్తించారు. తెనాలిలో 58, నరసరావుపేటలో 25, మంగళగిరిలో 38, దాచేపల్లిలో 13, సత్తెనపల్లిలో 8, ప్రత్తిపాడులో 6 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో గడిచిన 5 రోజుల్లో 1,310 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో జిల్లావ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4 వేల 518కి చేరాయి.
జిల్లాకేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది కరోనా బారినపడ్డారు. ఇప్పటికే కొన్ని కార్యాలయాల్లో ఇంటి నుంచి పని విధానాన్ని అనుసరిస్తున్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వినుకొండలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్...స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి పర్యటించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై సమీక్షించారు.
ఇదీచదవండి
లాక్డౌన్లో టికెట్లు తీసుకున్న ఆర్టీసీ ప్రయాణికులకు నగదు వాపస్