గుంటూరు జిల్లాలో ఇప్పటివరకూ 23మంది కరోనా నుంచి కోలుకోగా... 8మంది మరణించారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 195కు చేరుకుంది. గుంటూరులోని ఐడి ఆసుపత్రి, మంగళగిరిలోని ఎన్.ఆర్.ఐ ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అనుమానితులను కాటూరి వైద్యశాలలో ఐసోలేషన్ విభాగంలో ఉంచారు. గుంటూరు వైద్యకళాశాల ప్రాంగణంలో కరోనా నిర్థారణ పరీక్షలు జరుగుతున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన పరీక్షలు ఈ ప్రయోగశాలలో నిర్వహిస్తున్నారు. అనుమానితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ట్రూనాట్ కిట్ల ద్వారా జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో ప్రతిరోజు 10కి తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. కొత్త కేసులు అన్నీ రెడ్ జోన్ల పరిధిలోనే వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో లాక్ డౌన్ అమలును కూడా అధికారులు కఠినతరం చేశారు.
ఇవీ చదవండి: ఆ రెండు మరణాలను ముందే గుర్తించి ఉంటే...!