గుంటూరు జిల్లా మాచర్లలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే 98 వరకు కేసులు ఉండగా బుధవారం ఒక్కరోజే 35 మందికి వైరస్ సోకినట్టు అధికారులు చెప్పారు. రోజు రోజుకూ పెరుగుతోన్న కరోనా కేసులతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.
వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గురువారం నుంచి గురజాల డివిజన్ మొత్తం మళ్ళీ లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు గురజాల ఆర్డీవో పార్థసారధి తెలిపారు. నిత్యావసర సరకుల విక్రయాలు, ఇతర లావాదేవీలు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నామని చెప్పారు.
ఇవీ చదవండి: