గుంటూరు జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి ప్రభావంతో బ్యాంకులు మూతపడుతున్నాయి. తాజాగా యడ్లపాడులోని ఎస్బీఐలో కరోనా కలకలం రేపుతోంది. బ్యాంకు మేనేజర్‌కు, ముగ్గురు బ్యాంక్ సిబ్బందికి కరోనా సోకింది. దీంతో సోమవారం బ్యాంక్ మూసివేశారు. బ్యాంకు వద్దకు వచ్చిన ఖాతాదారులు సమాచారం తెలుసుకుని వెనుతిరిగారు.
ఇదీ చదవండి: కడప జిల్లాలో దారుణం.. ఒకే కుటుంబంలో ముగ్గురు హత్య