గుంటూరులోని రవాణాశాఖ ఉపకమిషనర్ కార్యాలయంలో ఎంవీఐ( మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్)గా పనిచేస్తున్న వి.నాగలక్ష్మి... కరోనా కట్టడిపై పాట పాడి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఈ కరోనాను అందరం ఆపుదామంటూ... ఆమె పాడిన పాట.. ప్రజలు ఎలా ఉండాలో తెలుపుతుంది. ఓ అధికారిగా చేసే పనులతో పాటు... బాధ్యత గల పౌరురాలిగా ఈ పాట పాడినట్లు నాగలక్ష్మి తెలిపారు. కరోనా మా దరికి రాకుమా అంటూ ప్రారంభించి... బాధ్యత గల పౌరులంతా సామాజిక దూరం పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: కరోనా ఎలా ఉంటుందో తెలుసా?.. ఈ చిత్రాల్లో చూడండి